
Release Year : 2004
Actors : Srikanth, Sivaji, Laya, Urvashi, K. Viswanath, Amuktamalyada, Brahmanandam, Tanikella Bharani, Rajyalaxmi
Music Director : Vidyasagar
Director : Viswanath K
Producer : Kausalendra Rao C
Writer : Viswanath K
Cinematographer : Durga Prasad V
Editor : Krishna Rao G
గానం : బాలు, సునీత
సాహిత్యం : విశ్వనాధ్
సంగీతం : పార్థసారధి
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కొండలరాయనికిక కోటి రాతురులు
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కొండలరాయనికిక కోటి రాతురులు
మేలుమేలాయెనే మంగ మాయమ్మకు అలకల తీపులు ఆర్చినందుకు
మేలుమేలాయెనే మంగ మాయమ్మకు అలకల తీపులు ఆర్చినందుకు
చాలుచాలాయె చెలి బుగ్గలకు
చాలుచాలాయె చెలి బుగ్గలకు
చెలువంపు గాటున చిక్కినందుకు
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
తెలుపరే భానునికి తెలవారలేదనీ
తెలుపరే భానునికి తెలవారలేదనీ
పులిసిన మేనా కొలది పవళించినందుకు
పిలువరే మెల్లగా పిల్లతెమ్మెరల
పిలువరే మెల్లగా పిల్లతెమ్మెరల
నలిగిన గుబ్బల నెలత అలసిసొలసినందుకు
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
స స గ రి ని ద మ ద ని ని ని ద ని స
గ గ మ ని ద మ ద ని స ద మ గ రి గ మ ని ద
సా ని ద మ గ రి స గ రి స గ రి స
తీయకే ఆ గడియ తీపిగడియలు రేలు తిరునాధుకౌగిలిని కాగువరకు
సాయకే ఆ మేను సాయకే ఆ మేను సరసాల సమయాలు సరిగంచు సవరించి సాగువరకు
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కొండలరాయనికిక కోటి రాతురులు
-------------------------------------------------------------------------------------------------
గానం : శంకర్ మహదేవన్ , రాధిక
సాహిత్యం : వేటూరి
సంగీతం : విద్యాసాగర్
కస్తూరితిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం
వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం
వ్రేపల్లె మా నందనం వేనోళ్ళ నీ కీర్తనం
ఆషాఢ మేఘాలొచ్చి ఆనందాలజల్లై కురిసే ఆరారే
వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం
వ్రేపల్లె మా నందనం వేనోళ్ళ నీ కీర్తనం
ఆలచెట్టి నెత్తినెట్టి అమ్మబోతే కిట్టయ్య ఏలు పెట్టి ఎంగిలి చేత్తడు
ఎట్టాగమ్మో ఇంకెట్టాగమ్మో
మాటు చూసి మడుగులోన మునగబోతే కిట్టయ్య సీరెలు గుంజి సక్కాబోతడు ఎట్టాగమ్మో ఇంకెట్టాగమ్మో
ఏరే కోక నీరే రైక అంటాడమ్మో.. అట్టాగని అంటాముట్టనట్టు ఉందామంటే
మురిపాలు పొంగిస్తే పాలెందుకంటాడు ఓలమ్మో పాలెందుకంటాడు ఓలమ్మో
హే సిగ్గొచ్చి చుట్టేస్తే చీరెందుకంటాడు ఓలమ్మో ఓలమ్మో
బుటుకు బుటుకు బుగ్గ గిల్లి పోయినట్టు
సిటుకు సిటుకు సినుకు ముద్దులిచ్చినట్లు
బుటుకు బుటుకు బుగ్గ గిల్లి పోయినట్టు
సిటుకు సిటుకు సినుకు ముద్దులిచ్చినట్లు
వయసు పచ్చి దాగినట్టు మనసు గిచ్చి పోయినట్టు
ఆరారే ఆరారే ఆనందబాల అందాల కిట్టయ్యకు అందాలహేల
ఆరారే ఆరారే ఆనందబాల అందాల కిట్టయ్యకు అందాలహేల
ఆరారే వేణుగాన సమ్మోహనం వేణుగాన సమ్మోహనం
వేలి మీద గోవర్ధనం వేలి మీద గోవర్ధనం వ్రేపల్లె మా నందనం
వ్రేపల్లె మా నందనం వేనోళ్ళ నీ కీర్తనం వేనోళ్ళ నీ కీర్తనం
కృష్ణా ముకుందా మురారే
నందయశోదా నందనునకు నవమదన దేవునకు గొబ్బిళ్ళో
చందనచర్చిత నీలదేహగగనాల సొగసుకు గొబ్బిళ్ళో
ఉసురుగాలులను వెదురుపాటలుగా..
ఉసురుగాలులను వెదురుపాటలుగా పలుకు వేణువుకు గొబ్బిళ్ళో
ఏటి మీద ఎన్నెల్లో ఎన్నెలంటి కన్నెల్లో
కన్నెగంటి సన్నెల్లో సన్నజాజి గిన్నెల్లో
వేదమంతా వెన్నలాగా కరిగే వేళల్లో వేదమంతా వెన్నలాగా కరిగే వేళల్లో
ఏ గీత బోధిస్తావో ఎవ్వరి గీత మారుస్తావో నందరే
వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం
వ్రేపల్లె మా నందనం వేనోళ్ళ నీ కీర్తనం
ఆషాఢ మేఘాలొచ్చి ఆనందాలజల్లై కురిసే ఆరారే
Ne chanthe oka
ReplyDelete