sirivennela telugu movie songs lyrics
Movie : Sirivennela (1987)
Cast : Benerji, Suhasini, Moon Moon Sen
Music : K V Mahadevan
Lyricist : Sirivennela
Director : K Viswanath
Producers : Ch. Ramakrishna Reddy, N. Bhaskara Reddy and U. Chinaveerraju
గానం : SP బాలు, P సుశీల
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : KV మహదేవన్
విధాత తలపున ప్రభవించినది
అనాది జీవన వేదం. ఓం...
ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం ఓం...
కనుల కొలనులో ప్రతిబింబించిన
విశ్వరూప విన్యాసం
ఎద కనుమలో ప్రతిధ్వనించిన
విరించి విపంచి గానం
సరస స్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది
సరస స్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితినీ ఈ కవనం
విపంచినై వినిపించితినీ ఈ గీతం
ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన
పలికిన కిలకిల స్వరముల దొరకని
జగతికి శ్రీకారము కాగా
విశ్వ కావ్యమునకిది భాష్యముగా
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
జనించు ప్రతిశిశు గళమున పలికిన
జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు
హృదయ మృదంగ ధ్వానం
జనించు ప్రతిశిశు గళమున పలికిన
జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు
హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆదితాళమున అనంతజీవన వాహినిగా
సాగిన సృష్టి విలాశములే
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
నా ఉఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం
నా ఉఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సరస స్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
Vidhatha thalapuna song meaning in telugu
బ్రహ్మ యొక్క ఆలోచనలలో ఎప్పుడో పుట్టిన స్రుష్టి మూల వేదం - " ఓం "
మన ప్రాణ నాడులకు మొట్టమొదట ప్రాణం ఇచ్హినదే ఈ " ఓం "
కళ్ళ కొలనులో ప్రతిభింబించిన స్రుష్టి రూపం ఈ "ఓం "
గుండే వంటి పర్వత శ్రేణులలో ప్రతిధ్వనించిన బ్రహ్మ యొక్క వీణా గానం
సరస సంగీతమైనటువంటిది,
మంచి నదీ ప్రవాహము వంటిది,
మొత్తం సామవేదం సారంశము అయినటువంటిది
ఈ నేను పాడిన పాట
నెనే బ్రహ్మనై రాసినది ఈ పాట/పద్యం/కవిత
వీణనై వినిపిస్తున్నా ఈ పాట
తూర్పు (దిక్కు) అనే వీణపై, సూర్య కిరణాలు అనే తీగెలను మీటుతూ
మెల్కొన్న పక్షులు అకాశపు వేదికపై, పలికిన కిల కిల రావాలు
స్వర ప్రపంచానికి మొదలు ఇంకా విశ్వం అనే దానికి వివరణ.
పుట్టే ప్రతి శిశివు పలికే జీవన రాగపు అలలే ఈ ఓం
చైతన్యం పొందిన హ్రుదయం మౄదంగం వలే ద్వనిస్తే ఆ శబ్దం ఓం
ఎప్పటి రాగమో మొట్టమొదటి తాళమై
అనంతమయిన జీవన నదిలా సాగిన ఈ సృష్టి విలాశమే - ఓం
నా ఉచ్చ్వాసం- కవిత్వం
నా నిశ్వాసం - పాట
-----------------------------------------------------------------------------------------------
గానం : SP బాలు, B వసంత, P సుశీల
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : KV మహదేవన్
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే...
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే...
చందమామ రావే జాబిల్లి రావే
చలువ చందనములు పూయ చందమామ రావే
జాజిపూల తావినీయ జాబిల్లి రావే
చలువ చందనములు పూయ చందమామ రావే
జాజిపూల తావినీయ జాబిల్లి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
గగనపు విరితోటలోని గోగుపూలు తేవే...
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే...
చందమామ రావే జాబిల్లి రావే
మునిజన మానస మోహిని యోగిని బృందావనం
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
మునిజన మానస మోహిని యోగిని బృందావనం
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
రాధా మాధవ గాధల రంజిలు బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
బృందావనం బృందావనం
హే కృష్ణా ముకుందా మురారీ
కృష్ణా ముకుందా మురారీ..జయ కృష్ణా ముకుందా మురారీ
జయ జయ కృష్ణా ముకుందా మురారీ
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే...
చందమామ రావే జాబిల్లి రావే
---------------------------------------------------------------------------------------------------------
గానం : SP బాలు
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : KV మహదేవన్
మెరిసే తారలదేరూపం...
విరిసే పూవులదేరూపం...
అది నా కంటికి శూన్యం...
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం...
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం...అపురూపం
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం...
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం...అపురూపం
ఎవరిరాకతో గళమున పాటల ఏరువాక సాగేనో
ఆ వసంతమాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనా
ఎవరి పిలుపుతో పులకరించి పురివిప్పి తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం...అపురూపం
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా
వెదురును మురళిగ మలచీ
ఈ వెదురును మురళిగ మలచీ
నాలో జీవన నాదం పలికిన నీవే..
నా ప్రాణ స్పందనా...నీకే నా హృదయ నివేదనా...
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం...
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం...అపురూపం
-------------------------------------------------------------------------------------------------------
గానం : SP బాలు
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం : KV మహదేవన్
ఆదిభిక్షువు వాడినేదికోరేదీ
బూడిదిచ్చే వాడినేది అడిగేదీ
ఆదిభిక్షువు వాడినేదికోరేదీ
బూడిదిచ్చే వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ
తీపిరాగాలా కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేదికోరేదీ
తీపిరాగాలా కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేదికోరేదీ
కరకు గర్జనల మేఘముల మేనికీ
మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ
తేనెలొలికే పూల బాణలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చిన వాడినేదికోరేదీ
తేనెలొలికే పూల బాణలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చిన వాడినేదికోరేదీ
బండరాలను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప
దరిజేరు మన్మథుని మసిచేసినాడూ వాడినేదికోరేదీ
వరగర్వమున మూడులోకాల పీడింప
తలపోయు ధనజులను కరుణించినాడూ వాడినేది అడిగేదీ
ముఖపీటి కోరేటి ఉగ్గు శంకరుడూ వాడినేదికోరేదీ
ముక్కంటీ ముక్కోటీ...ముక్కంటీ ముక్కోటీ తిక్క శంకరుడూ
ఆదిభిక్షువు వాడినేదికోరేదీ
బూడిదిచ్చే వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ...
------------------------------------------------------------------------------------------------------
గానం : SP బాలు
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : KV మహదేవన్
ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు సెలయేరు..
ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు సెలయేరు..
ననుగన్న నా వాళ్ళు ఆ...నా కళ్ళ లోగిళ్ళు
ననుగన్న నా వాళ్ళు ఆ...నా కళ్ళ లోగిళ్ళు
ఈ గాలి.. ఈ నేల..
చిన్నారి గొరవంక కూసేను ఆ వంక
నా రాత తెలిసాక వచ్చేను నా వంక
చిన్నారి గొరవంక కూసేను ఆ వంక
నా రాత తెలిసాక వచ్చేను నా వంక
ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక
ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక
ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగి దాకా
ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగి దాకా
ఎగసేను నింగి దాకా...
ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు సెలయేరు..
ననుగన్న నా వాళ్ళు ఆ...నా కళ్ళ లోగిళ్ళు
ఈ గాలి.. ఈ నేల..
ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను
ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను
ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను
ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను
ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను
ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను
కన్నె మూగమనసుకన్న స్వర్న స్వప్నమై
తళుకుమన్న తారచిలుకు కాంతి చినికులై
కన్నె మూగమనసుకన్న స్వర్న స్వప్నమై
తళుకుమన్న తారచిలుకు కాంతి చినికులై
గగనగళము నుండి అమర గానవాహిని
గగనగళము నుండి అమర గానవాహిని
జాలువారుతోంది ఇలా అమృతవర్షినీ అమృతవర్షిని
ఈ స్వాతివానలో నా ఆత్మ స్నానమాడే
నీ మురళిలో నా హృదయమే స్వరములుగా మారే
---------------------------------------------------------------------------------------------------------
గానం : SP బాలు
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : KV మహదేవన్
ప్రకృతి కాంతకూ ఎన్నెన్ని హొయలో
పదము కదిపితే ఎన్నెన్ని లయలో
ప్రకృతి కాంతకూ ఎన్నెన్ని హొయలో
పదము కదిపితే ఎన్నెన్ని లయలో
ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో
ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో
సిరివెన్నెల నిండిన ఎదపై
సిరిమువ్వల సవ్వడి నీవై
నర్తించగరావేళా...నిను నే కీర్తించే వేళా
ప్రకృతి కాంతకూ ఎన్నెన్ని హొయలో
పదము కలిపితే ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని హొయలో
అలల పెదవులతో శిలల చెక్కిలిపై
కడలి ముద్దిడు వేళా పుడమి హృదయంలో
అలల పెదవులతో శిలల చెక్కిలిపై
కడలి ముద్దిడు వేళా పుడమి హృదయంలో
ఉప్పొంగి సాగింది అనురాగమూ
ఉప్పెనగ దూకింది ఈ రాగమూ
ప్రకృతి కాంతకూ ఎన్నెన్ని హొయలో
పదము కదిపితే ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని హొయలో
కొండల బండల దారులలో
తిరిగేటి సెలయేటి గుండెలలో
కొండల బండల దారులలో
తిరిగేటి సెలయేటి గుండెలలో
రా రా రా రమ్మని పిలిచిన
కోన పిలుపు వినిపించగనే
రా రా రా రమ్మని పిలిచిన
కోన పిలుపు వినిపించగనే
ఓ కొత్త వలపూ వికసించగనే
ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో
ప్రకృతి కాంతకూ ఎన్నెన్ని హొయలో
పదము కదిపితే ఎన్నెన్ని లయలో
ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో
----------------------------------------------------------------------------------------------------
గానం : SP బాలు
సాహిత్యం : సిరివెన్నెల
సంగీతం : KV మహదేవన్
చినుకు చినుకు చినుకు చినుకు
తొలి తొలి తొలకరి చిలికిన చినుకు
పిలుపు పిలుపు పిలుపు పిలుపు
పుడమికి పులకల మొలకల పిలుపు
ఆషాఢ మాసాన ఆ నీలి గగనాన
మేఘాల రాగాల ఆలాపన

గానం : ప్రకాష్ రావు, సుశీల
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : KV మహదేవన్
పాటల్లో పాదలేనిది నోటి మాటల్లో చెప్పలేనిది
నీ గుండెల్లో నిండి ఉన్నది ఈ బంధాల్లో పలుకుతున్నది
అహా పాటల్లో పాదలేనిది నోటి మాటల్లో చెప్పలేనిది
నీ గుండెల్లో నిండి ఉన్నది ఈ బంధాల్లో పలుకుతున్నది
నీ heart చూసి heartbeat రూటు మార్చి కొట్టుకుంటూ
ఆహా ఓహొ అంటున్నది అది ఆహా ఓహొ అంటున్నది
ఈ ఇలలోన శిల్పైన కొలువైన వాణి
ఈ ఇలలోన శిల్పైన కొలువైన వాణి
వరవీణ మృదుపాణి వనరుహలోచను రాణి
వరవీణ మృదుపాణి వనరుహలోచను రాణి
నల్లనయ్య పిల్లన గ్రోవిందా
వెల్లువై ఎద పొంగిపోదా
నల్లనయ్య పిల్లన గ్రోవిందా
వెల్లువై ఎద పొంగిపోదా
పాట వింటూ లోకమంతా రాతి బొమ్మై నిలిచిపోదా
పాట వింటూ లోకమంతా రాతి బొమ్మై నిలిచిపోదా
నల్లనయ్యా
అందమైన సుందరాంగుల్లో ఎందరికో నెలవైన రాణివాసము
ఈ కోటలోన దాగి ఉన్నది నాటి ప్రేమ గాధలెన్నో కన్నది
అందమైన సుందరాంగుల్లో ఎందరికో నెలవైన రాణివాసము
ఈ కోటలోన దాగి ఉన్నది నాటి ప్రేమ గాధలెన్నో కన్నది
హిస్టరీల మిస్టులోని మిస్తరీని చాటి చెప్పి
ఆహా ఓహో అంటున్నది అది ఆహా ఆహా ఓహో ఓహో అంటున్నది
రాసలీలా రాగాహేలా రాసలీలా రాగాహేలా రసమయమై సాగు వేల
తరుణుల తనువులు వెన్నెల తరగలుగా ఊగు వేళా
నురుగుల పరుగుల సాగే యమునా నది ఆగు వేళా
నింగి నెల వాగు వంక చిత్రంగా చిత్తరువాయే
నింగి నెల వాగు వంక చిత్రంగా చిత్తరువాయే
నల్లనయ్య పిల్లన గ్రోవిందా
వెల్లువై ఎద పొంగిపోదా
-------------------------------------------------------------------------------------------------------------
గానం : SP బాలు, B వసంత
సాహిత్యం : సిరివెన్నెల
సంగీతం : KV మహదేవన్
పొలిమేర దాటిపోతున్నా ఓ గువ్వల చెన్న
పొరుగూరికి చేరిపోతున్నా ఓ గువ్వల చెన్న
కథ మారే రోజులు కోరెను ఓ గువ్వల చెన్న
కల తీరే దారులు వెతికేను ఓ గువ్వల చెన్న
గుళ్ళో నిను చూడలేకున్నా ఓ గువ్వల చెన్న
గుండెల్లో దాచుకున్నాలే ఓ గువ్వల చెన్న
ఈ సీమలో తిరుగాడిన ఓ గువ్వల చెన్న
నీ దీవెనలందించాలన్న ఓ గువ్వల చెన్న

No comments:
Post a Comment