Pages

Wednesday, January 1, 2014

Sutradharulu Telugu Movie Songs Lyrics


 Sutradharulu Telugu Movie Songs Lyrics
SUTRADHARULU - 1989
Movie : Sutradharulu (1989)
Cast : ANR, Murali Mohan, Bhanuchander,
Ramya Krishna, Sujatha
Direction : K Viswanth
Music : K.V.Mahadevan
Jolajolamma Jola Song Lyrics


చిత్రం : సూత్రధారులు (1989)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన :
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , ఎస్.పి.శైలజ
 ఆయతనవాం భవతి... ఆయతనవాం భవతి ... సూత్రధారులు (1989)
పల్లవి:
యోపాం పుష్పం వేదా పుష్పవాం
ప్రజావాహన్ పశుమాన్ భవతి
చంద్రామావ అపాం పుష్పం పుష్పవాం
ప్రజావాహన్ పశుమాన్ భవతి
యయేవం వేదా... తనాననాన
యయేవం వేద... తనాననాన
యోపామాయతనం వేదా... తానాననననాననా
ఆయతనవాం భవతి
ఆ ఆ ఆ ఆయతనవాం భవతి... ఆయతనవాం భవతి
యయేవం వేదా యోపామాయతనం వేదా
ఆయతనవాం భవతి ఆయతనవాం భవతి

చరణం:
అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాం భవతి
యోయగ్నే రాయతనం వేదా ఆయతనవాం భవతి
ఆపోవారగ్నే ఆయతనవాం
ఆ ఆ ఆ ఆయతనవాం భవతి ఆయతనవాం భవతి
యయేవం వేదా యోపామాయతనం వేదా
ఆయతనవాం భవతి ఆయతనవాం భవతి

చరణం:
వాయుర్వా అపామాయతనం... ఆయతనవాం భవతి
యోరాయో రాయతనం వేదా... ఆయతనవాం భవతి
ఆపోవైవో రాయతనం
ఆ ఆ ఆ ఆయతనవాం భవతి... ఆయతనవాం భవతి
యయేవం వేదా యోపామాయతనం వేదా
ఆయతనవాం భవతి... ఆయతనవాం భవతి...
-------------------------------------------------------------------------------------------------------
చిత్రం : సూత్రధారులు (1989)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : సి.నారాయణ రెడ్డి
గానం : ఎస్.పి.శైలజ

జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా .... సూత్రధారులు (1989)
జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా..
జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా

లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే

ఆఆ రేపల్లే గోపన్నా రేపు మరిచి నిదరోయే రేపు మరిచి నిదరోయే
యాదగిరి నరసన్నా ఆదమరచి నిదరోయే ఆదమరచి నిదరోయే
ఏడుకొండల ఎంకన్నా ఎప్పుడనగా నిదరోయే ఎప్పుడనగా నిదరోయే
కోడె పిల్లాడా నీకేమో కునుకైనా రాదాయే కునుకైనా
లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే
జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా

నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా
మీనావతారమెత్తి మేని చుట్టు రాబోకురా
అరెరెరెరె యాహి యాహి యాహి యాహి యాహి యాహి
క్రిష్ణావతారమెత్తి కొకలెత్తుకు పోబోకురా
అరెరెయ్రెయ్ యాహి యాహి యాహి యాహి యాహి యాహి
వామనావతరమెత్తి వామనావతరమెత్తి సామిలాగా ఐపోకు
బుద్ధావతారమెత్తి బోధి చెట్టుని అంటి ఉండకు
రఘు వంశ తిలకుడివై రాముడివై రమణుడివై రాముడివై రమణుడివై
సీత తోనే ఉండిపోరా గీత నువ్వే దిద్దిపోరా
ఈ సీత తోనే ఉండిపోరా నా గీత నువ్వే దిద్దిపోరా
లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే

జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా
లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే
--------------------------------------------------------------------------------------------
చిత్రం: సూత్రధారులు (1989)
రచన:
సంగీతం: K.V.మహదేవన్
గానం: S.P.బాలు
యదుకుల వాడలకు కృష్ణ మూర్తి .... సూత్రధారులు (1989)
పల్లవి:
జై శ్రీ కృష్ణ పరమాత్మకు జై
యదుకుల వాడలకు కృష్ణ మూర్తి
నీవు ఏమి పనికి వస్తివయ్య కృష్ణమూర్తి
నీవు ఏమి పనికి వచ్చినావు కృష్ణమూర్తి

పాలకోసమొచ్చినాను గోపికాంబ
పాలు పోసి నన్ను పంపు గోపికాంబ
మంచి పాలు పోసి నన్ను పంపు గోపికాంబ

యదుకుల వాడలకు కృష్ణ మూర్తి
నీవు ఏమి పనికి వచ్చినావు కృష్ణమూర్తి
జై శ్రీ కృష్ణ పరమాత్మకు జై

దింతక్కు తాదిమి దింతక్కు తాదిమి
దింతక్కు తకదిమి దింతక్కు తకదిమి
దింతాక్కు దింతాక్కు దింతకు త దింత
కొత్త కోడలినైన కృష్ణమూర్తి
మా అత్తగారినడగరాద కృష్ణమూర్తి
కొత్త కోడలినైన కృష్ణమూర్తి
మా అత్తగారినడగరాద కృష్ణమూర్తి
మా అత్తగారినడగరాద కృష్ణమూర్తి
కొత్త కోడలివైతే గోపికాంబ నే రొక్కమిస్త పుచ్చుకోవే గోపికాంబ
కొత్త కోడలివైతే గోపికాంబ నే రొక్కమిస్త పుచ్చుకోవే గోపికాంబ
------------------------------------------------------------------------------------------------------
 చిత్రం : సూత్రధారులు (1989)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన :
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , ఎస్.పి.శైలజ

అయ్యా.. రామయ్యా కొలిచీ నందుకు నిన్ను కోదండ రామ... సూత్రధారులు (1989)
అయ్యా.. రామయ్యా
కొలిచీ నందుకు నిన్ను కోదండ రామ
కొలిచీ నందుకు నిన్ను కోదండ రామ
కోటి దివ్వెలపాటి కొడుకూవైనావా
తలచినందుకు నిన్ను దశరథ రామా
వెండీ కొండల సాటి తండ్రివైనావా

జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా
జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా

బుడి బుడి నడకల బుడతడివై
ఒడిలొ ఒదిగిన ఓరయ్యా
బుడి బుడి నడకల బుడతడివై
ఒడిలో ఒదిగిన ఓరయ్యా
కలల పంటగా, బతుకు పండగా
కలల పంటగా, బతుకు పండగా
కళ్యాణ రాముడిలా కదలి వచ్చావా

జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా
జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా

నడిచే నడవడి ఒరవడిగా
నలుగురు పొగడగా ఓరయ్యా
నడిచే నడవడి ఒరవడిగా
నలుగురు పొగడగా ఓరయ్యా
నీతికి పేరుగా, ఖ్యాతికి మారుగా
నీతికి పేరుగా, ఖ్యాతికి మారుగా
సాకేత రాముడిలా సాగిపోవయ్యా

జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా
జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా

ఎంతటివాడోయ్ రామచంద్రుడు
ఎంతటివాడోయ్ రామచంద్రుడు
ఆ తాటకిని చండాడినాడోయ్
యాదవును కాపాడినాడోయ్
ఎంతటివాడోయ్ రామచంద్రుడు
ఎంతటివాడోయ్ రామచంద్రుడు
మిథిలకు వచ్చీ, రామయ్యా రాముడు
శివునివిల్లు విరిచీ, రామయ్యా రాముడు
సీతను చేపట్టి, రామయ్యా రాముడు
సీతను చేపట్టి, రామయ్యా రాముడు
సీతారాముడు అయ్యేదెపుడో

జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా
జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా

జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా
జయరామా జగదభి రామా
పరంధామా పావన నామా
------------------------------------------------------------------------------------------------------
చిత్రం : సూత్రధారులు (1989)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : సి.నారాయణ రెడ్డి
గానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం , ఎస్.పి.శైలజ
మూడు బురుజుల కోట.. ముత్యాల తోట... సూత్రధారులు (1989)
పల్లవి :
లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
మ్మ్... మూడు బురుజుల కోట ముత్యాల తోట
ముంగిట్లో చిన్నారి బావకు మురిపాల తీట
మూడు బురుజుల కోట ముత్యాల తోట
సందిట్లో వయ్యారి మరదలికి సరసాల మూట
లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....

చరణం : 1
ఓ... ఇంతలేసి కళ్లున్న ఇంతి మనసు చేమంతా
ముద్దబంతా చెప్పరాదా చిగురంతా
ఇంతలోనే చెప్పుకుంటే కొంటె వయసు
అన్నన్నా వదిలైనా నన్నైనా నిన్నైనా
ఇంతలేసి కళ్లున్న ఇంతి మనసు చేమంతా
ముద్దబంతా చెప్పరాదా చిగురంతా
ఇంతలోనే చెప్పుకుంటే కొంటె వయసు
అన్నన్నా వదిలైనా నన్నైనా నిన్నైనా

కిన్నెరల్లే కన్నె పరువం కన్నుగీటి కవ్విస్తే
ఉన్నవేడి ఉప్పెనల్లే ఉరకలేసి ఊరిస్తే
లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....

చరణం : 2
ఓ... గడుసుగాలి పడుచుమొగ్గ తడిమిపోతే
కాయౌనా పండౌనా కామదేవుని పండగౌనా
కాముడయ్య లగ్గమెట్టి కబురుపెడితే
వారమేలా వర్జమేలా వల్లమాలిన వంకలేలా
గడుసుగాలి పడుచుమొగ్గ తడిమిపోతే
కాయౌనా పండౌనా కామదేవుని పండగౌనా
కాముడయ్య లగ్గమెట్టి కబురుపెడితే
వారమేలా వర్జమేలా వల్లమాలిన వంకలేలా

ముసురుకున్న ముద్దులన్నీ మూడుముళ్ల గుర్తులైతే
కలవరించు పొద్దులన్నీ కాగి పోయి కౌగిలైతే
మూడు బురుజుల కోట ముత్యాల తోట
సందిట్లో వయ్యారి మరదలికి సరసాల మూట
లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
--------------------------------------------------------------------------------------------------------
చిత్రం : సూత్రధారులు (1989)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన :
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
మహారాజ రాజశ్రీ మహానీయులందరికి వందనాలు .... సూత్రధారులు (1989)
పల్లవి:
మహారాజ రాజశ్రీ మహానీయులందరికి
వందనాలు వంద వందనాలు
మహారాజ రాజశ్రీ మహానీయులందరికి
వందనాలు వంద వందనాలు
హరిహరులను సేవించే ఈ దాసులాడేటి
తందనాలు తకిట తందనాలు
హరిహరులను సేవించే ఈ దాసులాడేటి
తందనాలు తకిట తందనాలు
వందనాలు వందవందనాలు
తందనాలు తకిట తందనాలు

చరణం:
సన్నాయి స్వరమెక్కి చిన్నారి బసవన్న
చెన్నార చిందాడ కన్నార కళ్ళార
సిరులిచ్చి దీవించే సింహాదిరప్పన్న
సిరిగజ్జలల్లాడ సేవులార విన్నారా
ముంగిళ్ళ బసవన్న మురిసి ఆడేవేళ
ముంగిళ్ళ బసవన్న మురిసి ఆడేవేళ
గుండె గుడిలో శివుడు మేలుకోవాల
కోదండ రామన్న గోవుల్ల గోపన్న
కోలాటమాడుతు కొలువు తీరాల

మహారాజ రాజశ్రీ మహానీయులందరికి వందనాలు వంద వందనాలు
తందనాలు తకిట తందనాలు వందనాలు వందవందనాలు



















No comments:

Post a Comment

 

Sample text

category

Category Name

Sample Text