Atma Gowravam telugu movie songs lyrics
Movie : Atma Gowravam (1966)
Cast : A Nageswara Rao, Kanchana,
Rajasri, Gummadi
Music : Saluri Rajeswara Rao
Lyrics : Arudra, Dasarathi,
C Narayana Reddy, SriSri
Director : K Viswanath
Producer : D. Madhusudana Rao
Banner : Annapurna Pictures
Release Date : March 18, 1966
చిత్రం : ఆత్మగౌరవం (1966)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
రచన : దాశరథి
గానం : పి.సుశీల
అందెను నేడే అందని జాబిల్లి.......... ఆత్మ గౌరవం (1966)
పల్లవి :
అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్నీ ఆతని వెన్నెలలే
అందెను నేడే అందని జాబిల్లి
చరణం : 1
ఇన్నేళ్ళకు విరిసె వసంతములు
ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు
నిదురించిన ఆశలు చిగురించెలే (2)
చెలికాడే నాలో తలపులు రేపెనులే
అందెను నేడే అందని జాబిల్లి
చరణం : 2
నా చెక్కిలి మెల్లగ మీటగనే
నరనరముల వీణలు మ్రోగినవి
గిలిగింతల నా మేను పులకించెలే (2)
నెలరాజే నాతో సరసములాడెనులే
అందెను నేడే అందని జాబిల్లి
చరణం : 3
ఇక రాలవు కన్నుల ముత్యములు
ఇక వాడవు తోటల కుసుమములు
వినువీధిని నామది విహరించెలే (2)
వలరాజే నాలో వలపులు చిలికెనులే ॥
------------------------------------------------------------------------------------------------------
చిత్రం : ఆత్మగౌరవం (1966)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, సుశీల
ప్రేమించనిదే పెళ్ళాడనని తెగకోతలు కోశావులే... ఆత్మ గౌరవం (1966)
పల్లవి :
ప్రేమించనిదే పెళ్ళాడనని తెగకోతలు కోశావులే...
ఆ మాటలు ఏమైనవి? అహా! అయ్యగారు ఓడారులే..
ఉహు..ఉహు...
పెళ్ళాడనిదే ప్రేమించనని తెగ లెక్చరు దంచావులే...
నీ మాటకు.. నీ చేతకు.. అహ అంతు పొంతు లేదాయలే..
నీ వలపు తెలుపక ఊ అంటివి నా తలపు తెలియక ఔనంటివి
నీ వలపు తెలుపక ఊ అంటివి నా తలపు తెలియక ఔనంటివి
నీ ఆశయం ఏమైనది? అహ! నీటిమూట అయిపోయెలే
ప్రేమించనిదే పెళ్ళాడనని తెగకోతలు కోశావులే
చరణం 1:
శ్రీరంగనీతులు చెప్పావులే చిత్రంగ ప్లేటును తిప్పావులే...
శ్రీరంగనీతులు చెప్పావులే చిత్రంగ ప్లేటును తిప్పావులే
అమ్మాయిలు ఎటు బొంకినా ఆహా అందమెంతొ చిందేనులే
ప్రేమించనిదే పెళ్ళాడనని తెగకోతలు కోశావులే
చరణం 2:
ఈ సొగసు నవ్వి కవ్వింతులే... నా వయసు నిన్నే బాధించులే
కనుపాపలో నిను దాచితే నను వీడి పోలేవులే....
అహ...నను వీడి పోలేవులే....
చరణం : 3
పైపైన మెరుగులు కొన్నాళ్లవే మదిలోన మమతలు పూయాలిలే...
వయ్యారమే ఒలికించినా అయ్యగారు చలియించరు..
ఆహా! అయ్యగారు చలియించరు ...
ప్రేమించనిదే పెళ్ళాడనని తెగకోతలు కోశావులే...
నీ మాటకు.. నీ చేతకు.. అహ అంతు పొంతు లేదాయలే..
ప్రేమించనిదే పెళ్ళాడనని తెగకోతలు కోశావులే
-------------------------------------------------------------------------------------------------------
చిత్రం : ఆత్మ గౌరవం (1966)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
రచన : ఆరుద్ర
గానం : ఘంటసాల
ప్రేమించి పెళ్లిచేసుకో, నీ మనసంతా హాయి నింపుకో...... ఆత్మ గౌరవం (1966)
సాకీ :
ఓ... సోదరసోదరీమణులారా
ఆదరించి నా మాట వింటారా
వింటాం... చెప్పు
పల్లవి :
ప్రేమించి పెళ్లిచేసుకో
నీ మనసంతా హాయి నింపుకో
ప్రేమించి పెళ్లిచేసుకో...
చరణం : 1
వరుని వలపేమిటో...వధువు తలపేమిటో
తెలుసుకోలేక పెళ్లిళ్లు జరిపించినా॥
తెలిసి కట్నాలకై బతుకు బలిచేసినా
కడకు మిగిలేది ఎడమోము
పెడమోములే॥
చరణం : 2
మనిషి తెలియాలిలే....మనసు కలవాలిలే
మరచిపోలేని స్నేహాన కరగాలిలే॥
మధుర ప్రణయాలు
మనువుగా మారాలిలే
మారి నూరేళ్లపంటగా వెలగాలిలే॥
చరణం : 3
నలుడు ప్రేమించి పెళ్లాడె దమయంతిని
వలచి రుక్మిణియే పిలిపించె శ్రీకృష్ణుని॥
తొలుత మనసిచ్చి మనువాడె దుష్యంతుడు
పాత ఒరవళ్లు దిద్దాలి మీరందరూ॥
---------------------------------------------------------------------------------------------------
చిత్రం : ఆత్మ గౌరవం (1966)
సంగీతం : సాలూరి రాజేశ్వర్ రావు
రచన : దాశరథి
గానం : ఘంటసాల , P.సుశీల
ఒక పూల బాణం తగిలింది........... ఆత్మ గౌరవం (1966)
ఒక పూల బాణం తగిలింది
మదిలో తొలి ప్రేమ దీపం వెలిగింది లే
నాలో వెలిగింది లే ||ఒక||
చరణం 1 ||
అలనాటి కలలే ఫలియించే నేడే ||అల
మనసైన వాడే మనసిచ్చి నాడే
ఈ ప్రేమ లో లోకమే పొంగి పోయి
వసంతాల అందాలా ఆనందాల ఆడాలొయి
చరణం 2||
ఏ పూర్వ బంధమో అనుభన్ధ మాయె
అపురూప మైన అనురాగ మాయె
నీ కౌగిటా హాయిగా సోలిపోయి
సరదాల ఉయ్యాల ఉల్లాసం గా వూగాలోయి
--------------------------------------------------------------------------------------------------------
చిత్రం : ఆత్మ గౌరవం (1966)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
రచన : ఆరుద్ర
గానం: ఘంటసాల, సుశీల
రానని రాలేనని ఊరకె అంటావు....... ఆత్మ గౌరవం (1966)
పల్లవి :
రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు
రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు...
చరణం 1:
కొంటె చూపు చూడకు గుండె కోత కోయకు
కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు....
కొంటె చూపు చూడకు గుండె కోత కోయకు
కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు...
వేషమైనా మోసమైనా అంతా నీ కోసం ...
ఊహూ...అలాగా...
రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు...
చరణం 2:
ఎదను గాయమున్నది ఊరడించమన్నది
మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది...పాపం...
ఎదను గాయమున్నది ఊరడించమన్నది
మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది..
గుండె మీద వాలి చూడు గోడు వింటావు
ష్...అబ్బబ్బబ్బా...
రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు
చరణం 3:
దోర వయసు వేడిలో కోరచూపు వాడిలో
దూరమైన మనసు పడే బాధ అయ్యయ్యో...
దోర వయసు వేడిలో కోరచూపు వాడిలో
దూరమైన మనసు పడే బాధ అయ్యయ్యో...
కరుణ చూపి కరుగకున్న టాటా... చీరియో
టాటా... చీరియో
రానని రాలేనని ఊరకె అంటావు
రావలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు....

No comments:
Post a Comment