Pages

Thursday, January 2, 2014

Iddaru Mitrulu telugu movie songs lyrics


Iddaru Mitrulu telugu movie songs lyrics
Movie : Iddaru Mitrulu (1999)
Cast : Chiranjeevi,  Sakshi Sivanand, Ramya Krishnan.
Music :  Mani Sarma
Lyrics : Sirivennela Sitarama Sastry, Chandrabose
Director : K.Raghavendra Rao
Producer : Chanti Addala
Banner : R K Film Associates
Release Date : 30th April 1999
చిత్రం : ఇద్దరు మిత్రులు (1999)
సంగీతం : మణిశర్మ
రచన :
గానం : మనో, చిత్ర
నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంట్ట అమ్మాయి .... ఇద్దరు మిత్రులు (1999)


పల్లవి :
హేహేహేరబ్బ నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంట్ట అమ్మాయి ||3||
ఒట్టేసి చెప్పాలా తనుంటుంది గులాబీలా ||2||
మనిషే మరీ భోళాగా తనమాటే గలగలా
తానేలేని వీణా ఆ ప్రాణం విలవిల ||నూటొక్క||

చరణం : 1
గాలేనువ్వైతే తెరచాపల్లే నిలబడతా
జోలాలేనువ్వైతే పసిపాపల్లే నిదరోతా
రాణిలాగా కోరితే బంటులాగా వాలనా
భక్తితోటివేడితే దేవతల్లే చూడనా
సన్నాయి సవ్వడల్లే సంక్రాంతి సందడల్లే రోజంతా సరిక్రొత్త కేరింతలే
మలినాలేవి లేని మధుగీతం మనదిలే
ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి ||2||

చరణం : 2
మూగై నువ్వుంటే చిరునవ్వుల్లో ముంచేస్తా
నువ్వు మోడలై నిలుచుంటే చిగురించేలా మంత్రిస్తా
కోపమొచ్చినప్పుడు బుజ్జగించవే మేనకా
కొంటెవేష మేసినప్పుడు వెక్కిరింత నాదట
చప్పట్లు కొద్దిసేపు చివాట్లు కొద్దిసేపు మనమధ్య వుంటాయి పోతాయిలే
ఆనందాన్ని యేలే అధికారం మనదిలే
ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి ||2||
చూస్తాడు సింహంలా చిందేస్తాడు ప్రవాహంలా ||2||
మనసే మేఘమాలా తన ఉనికే వెన్నెలా
తానే లేనినేలా పోతుంది విలవిలా ||నూటొక్క||
-----------------------------------------------------------------------------------------
చిత్రం : ఇద్దరు మిత్రులు (1999)
సంగీతం : మణిశర్మ
రచన :  సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఉదిత్ నారాయణ్ , హరిణి
చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌రే.... ఇద్దరు మిత్రులు (1999)

పల్లవి :
చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌................................... చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌.........
చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌రే
బాపుబొమ్మ కదులుతోంది బాపురే
చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌రే
ఊపు చూపి అవుతోంది ఊపిరే
ఆర్టుఫిల్మ్‌లో తలకుచోటు ఇవ్వగా
నా హార్టు ఫిల్మ్‌లో తనకు చోటు ఇవ్వగా
నేనౌత్తా కొత్త సత్యజిత్‌రే ||చాంగ్‌||

చరణం 1
ఎంకి పిల్ల కొప్పు యక్షకన్య మెరుపు
ఎలిజిబిత్‌ నునుపు ఎదురులేని రూపు
తేనేపాత్రవే లేక క్లియోపాత్రవేతెల్లవారిని రాత్రివే
గ్రీకు ఇంటివే గిటారు తంత్రివే చూపుసాక మంత్రివే
ఇండియాలో నీకు సాటి వుండరే ||చాంగ్‌||

చరణం 2
మాయలేడి హొయలు మైక్రోసాఫ్ట్ కలలు
ఎంకి కడవ వగలు తేరెక్రాఫ్ట్ లయలు
గుల్షగుంతల బంతిపూల సంతలా కొంగుచుట్టినకోయలా
దేవకాంతుల దమయంతి రీతిలా పూట గత్తిలా వెన్నలా
నిగనిగల నగల నిధికి నువు వోనరే
చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌రే హంపి శిల్ప కళలు నాలో హాజరే
చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌ చాంగ్‌రే పాలు సరసులాంటి సొగసుకు ఆన్సరే
క్యాటువాక్‌లు ఫ్యాషన్‌ పరేడ్‌లు యాడ్‌ సంస్థలు
అందాల క్లబ్‌లు నాస్టైల్స్‌నే చేస్తాయి స్పాంసరే
-----------------------------------------------------------------------------------
చిత్రం : ఇద్దరు మిత్రులు (1999)
సంగీతం : మణిశర్మ
రచన : చంద్రబోస్
గానం : ఎస్.పి.బాలు, సునీత
మనసా వాచా మనసిస్తే...మైసూర్ ప్యాలెస్ రాసిస్తా... ఇద్దరు మిత్రులు (1999)
పల్లవి :
మనసా వాచా మనసిస్తే... మైసూర్ ప్యాలెస్ రాసిస్తా
మనసా వాచా మనసిస్తే... మైసూర్ ప్యాలెస్ రాసిస్తా
పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా
జిగిబిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా
ప్రియతమ పదవందిస్తే ఆ పుడమిని ఎదురిస్తా
దా దా దా దా ఆ....
పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా
మనసా వాచా మనసిస్తే... మైసూర్ ప్యాలెస్ రాసిస్తా

చరణం : 1
కళ్ళతోటి కావలిస్తే కాళిదాసు నవలిస్తా
ఎదకు ఎదురు పడితే ఆ... పెదవి పొదిగి పెడతా
కొంగుముడి చేరువొస్తే కోహినూరు కొసరిస్తా
నడక మిడిసి పడితే ఓ... నడుము మడత ముడతా
కృష్ణయ్యలా వెన్నంటితే నా సన్ననీ చెల్లించునా
వనితా విను చెబుతా కథ ఆ....
మనసా వాచా మనసిస్తే... మైసూర్ ప్యాలెస్ రాసిస్తా
పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా

చరణం : 2
రాజులాగ రాజుకుంటే వైజయంతిమాలేస్తా
గడియ గడువు పెడితే ఆ... తడిసి కడివెడవుతా
సాగరంలా కమ్ముకుంటే బ్రహ్మపుత్ర నదినిస్తా
కలసి మెలసి పోతే ఓ... మెరిసి కురిసి వెళతా
వాల్మీకిలా వేటాడితే ప్రేమాయణం వర్ణించుతా
లలితా ముడిపడతా పద ఆ....
మనసా వాచా మనసిస్తే... మైసూర్ ప్యాలెస్ రాసిస్తా
పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా
ప్రియుతమ పదవందిస్తే ఆ పుడమిని ఎదురిస్తా
జిగిబిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా
రా రా నాదా... ఓ...
-----------------------------------------------------------------------------------
చిత్రం : ఇద్దరు మిత్రులు (1999)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : పార్థసారధి , చిత్ర
బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ....... ఇద్దరు మిత్రులు (1999)
పల్లవి :
బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి అందాలబొమ్మ గీయమ్మ..
బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి అందాలబొమ్మ గీయమ్మ..
ఎన్నాళ్ళనుంచి కన్న కలలు తెచ్చి అరుదైన రూపం ఈ బొమ్మ
చెంత చెదరని మురిపించే చిత్రం చూడనీ
వీరివీరి గుమ్మాడీ వాడీ పేరేంటమ్మా అమ్మాయి ఓ . . . ||బంగారం||

చరణం : 1
జో . . . లాలి అని కొత్తరాగాలెన్నో పలుకమ్మా తీయగా
ఈ . . . మంచు బొమ్మ పంచప్రాణాలతో నిలువెల్లా విరియగా
అమ్మ అంటుంది కమ్మగా పసిపాప తేనే పాట
అమ్మాయిగారు అమ్మగా పదవిని - పొందునట
ఇల్లంతా బొమ్మల కొలువు మనసంత నవ్వుల నిలవుఓ ||బంగారం||

చరణం : 2
అడగక ముందే అన్నీ చేసి సేవకుడవి అనిపిస్తావు
అలసిన ఆశకి జీవం పోసి దేవుడిలా కనిపిస్తావు
ఈ జన్మలోను నే తీర్చలేని రుణమై బంధించావు
నీ స్నేహంతోనే చిగురించమని వరమే - అందించావు
ఎప్పుడూ నా కళ్ళు చూడనీ వెలుగే చూపించినావు
ఎప్పుడు నా గుండెపాడనీ మధురీమ నేర్పావు
నీలికళ్ళే చిందే తడిలో హరివిల్లే రాని త్వరలో ఓ . . .
ఓ . . .మాతృత్వానికి మగరూపానివై
నాన్నతనంలో కర్ణుడివై అన్నగుణంలో కృష్ణుడివై
బతుకంతా జతగా నిలిచే విధివో
పతినే మించిన తోడువై
బంధుత్వాలకి అందని బంధం ఉందని చూపిన నేస్తమా
-------------------------------------------------------------------------------------
చిత్రం : ఇద్దరు మిత్రులు (1999)
సంగీతం : మణిశర్మ
రచన :
గానం : ఎస్.పి.బాలు , చిత్ర
హాయ్‌రుక్కు రుక్కు మామ్‌ ..... ఇద్దరు మిత్రులు (1999)
పల్లవి
హాయ్‌రుక్కు రుక్కు మామ్‌ ||3||
నీ గుట్ట విప్పువాసి గుట్టు చెప్పవాహే
చికుబుకురుక్కుమామ్‌ ||ఆయ్‌||
షికారు వెళ్ళదాం
వెళ్ళాకా
సినిమాలు చూద్దాం
ఆ చూశాకా
షాపింగ్‌ చేద్దాం
ఆ చేశాకా
చపాతీ తింద్దాం
ఆ తిన్నాకా
తిన్నదంత అరిగేట్టు ముద్దు మీద ముద్దపెట్టు ||హేయ్‌||
హాయ్‌రుక్కు రుక్కు మామ్‌ చిలకముక్కు రుక్కుమామ్‌ ||2||
చెరుకుముక్క రుక్కుమామ్‌ రుక్కురుకురుక్కుమామ్ ||హాయ్‌||

చరణం 1
జూపార్కు వైపు పరుగుతీద్దాం
చెట్టు చాటు పొదలో చొరవు చేద్దాం
గోల్‌కొండ వైపు అడుగులేద్దాం
పాడుబడ్డ గృహంలో ఆడుకుందాం
నక్షత్రశాలకు పోదాం నేడు సాక్షాత్తు స్వర్గం చూద్దాం
షామీర్‌పేటకు సిద్ధం చలికోనేటి స్నానం చేసేద్దాం ||హేయ్‌||

చరణం 2
ఉస్మానీయలో చదువుకుందాం
ప్రేమలోన డాక్టరేటు పుచ్చుకుందాం
అసెంబ్లీహాల్లో హాజరవుదాం
ప్రేమగుర్తు జండా ఎగురవేద్దాం
ఆకాశవాణికి పోదాం మన అందాల వార్తలు చెబుదాం
ఆపైన మార్కెటుకు వెళ్ళదాం
అయిదు కేజీలు మల్లెలుకొని తెద్దాం ||హాయ్‌||













No comments:

Post a Comment

 

Sample text

category

Category Name

Sample Text