Pages

Thursday, January 2, 2014

Bhairava Dweepam telugu movie songs lyrics

Bhairava Dweepam telugu movie songs lyrics


Movie : Bhairava Dweepam (1994)
Cast : Nandamuri Balakrishna, Roja Selvamani
Rambha
Music : Madhavapeddi Suresh
Lyrics :  Sirivennela, Veturi, Vadepalli Krishna,
Singeetham Srinivasa Rao
Director : Singeetham Srinivasa Rao
Producer : B. Venkatarami Reddy
Banner : Chandamama Vijaya Combines
Release Date : April 14, 1994
చిత్రం : భైరవద్వీపం (1994)
సంగీతం : మాధవపెద్ది సురేష్
రచన : వడ్డేపల్లి కృష్ణ
గానం : ఎస్.జానకి
అంబా! శాంభవి! భద్రరాజ గమనా! కాళీ హైమవతీశ్వరీ త్రినయనా! ....... భైరవద్వీపం (1994)

అంబా! శాంభవి! భద్రరాజ గమనా!
కాళీ హైమవతీశ్వరీ త్రినయనా!
అమ్మలగన్న అమ్మవే
ఈ అమ్మ మనసునే ఎరుగవా
ఒక అమ్మగా నువు కరుగవా
ఆ శాపమే ఇక బాపవా ||
ఏనాడైనా ఏ వరమైనా కలలోనైనా అర్థించానా
విధి నెదిరించే శక్తియె లేక ఈ విధి నిన్నే వేడితినమ్మా

కష్టాలన్ని కడతేర్చవా
కన్నీళ్లన్ని తొలగించవా
కారుణ్యమ్ము చూపించవా -
ఈ ఘోరమ్ము తప్పించవా -
ఒక అమ్మగా నువు కరుగవా ||
తరతరాలుగ నిన్ను తల్లివని కొలిచాను
మమ్మింక మన్నించవే
సుతుని శాపము మార్చి నా రూపు గ్రహియించి
ఆదుకొన అరుదెంచవే
సత్యమ్ముగా నీది మాతృ హృదయమ్మైతే
సత్వరమ్మే సాగిరా
ఉరుములా మెరుపులా ఉప్పొంగు కడలిలా
శీఘ్రమ్ముగా కదలిరా

ఓంకార బీజాక్షరీ త్రైలోక్య రక్షాకరీ
శ్రీ చక్ర సంచారిణీ రుద్రాణి నారాయణీ
పాహిమాం పరమేశ్వరీ రక్షమాం రాజేశ్వరీ
పాహిమాం పాహిమాం పాహిమాం పాహిమాం
--------------------------------------------------------------------------------------
చిత్రం : భైరవద్వీపం (1994)
సంగీతం : మాధవపెద్ది సురేష్
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : ఎస్.జానకి
నరుడా ఓ నరుడా ఏమి కోరిక.. కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా... భైరవద్వీపం (1994)
పల్లవి :
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా
కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా
నరుడా ఓ నరుడా ఏమి కోరిక

చరణం : 1
రా దొరా ఒడి వలపుల చెరసాలర
లే వరా ఇవి దొరకని సరసాలురా
దోర దొంగ సోకులేవి దోచుకో సఖా
రుతువే వసంతమై పువ్వులు విసరగా
ఎదలే పెదవులై సుధలే కొసరగా
ఇంత పంతమేల బాలకా
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా
నరుడా ఓ నరుడా ఏమి కోరిక

చరణం : 2
నా గిలి నిను అడిగెను తొలి కౌగిలి
నీ కసి స్వరమెరుగని ఒక జావళి
లేత లేత వన్నెలన్నీ వె న్నెలేనయా
రగిలే వయసులో రసికత నాదిరా
పగలే మనసులో మసకలు కమ్మెరా
ఇంత బింకమేల బాలకా
నరుడా ఓ నరుడా ఏమి కోరిక

నరుడా ఓ నరుడా ఏమి కోరిక
కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా
కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
------------------------------------------------------------------------------------
చిత్రం : భైరవద్వీపం (1994)
సంగీతం : మాధవపెద్ది సురేష్
రచన : సింగీతం శ్రీనివాసరావు
గానం : కె.ఎస్.చిత్ర
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా ..... భైరవద్వీపం (1994)

పల్లవి :
ఆ ఆ ఆ... ఆ... ఆ.....
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
మనసే మందారమై వయసే మకరందమై
అదేదో మాయచేసినది
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా

చరణం : 1
ఝుమ్మంది నాదం రతివేదం
జతకోరే భ్రమర రాగం
రమ్మంది మోహం ఒక దాహం
మరులూరే భ్రమల మైకం
పరువాల వాహిని ప్రవహించే ఈవని
ప్రభవించె ఆమని పులకించె కామిని
వసంతుడై చెలికాంతుడై... దరి చేరె మెల్లగా...
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా

చరణం : 2
ఋతువుమహిమేమో విరితేనె
జడివానై కురిసె తీయగా
లతలు పెనవేయ మైమరిచి
మురిసేనూ తరువు హాయిగా
రాచిలుక పాడగా రాయంచ ఆడగా
రసలీల తోడుగా తనువెల్ల ఊగగా
మారుడె సుకుమారుడై.... జతకూడె మాయగా...
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
మనసే మందారమై వయసే మకరందమై
అదేదో మాయచేసినది
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
------------------------------------------------------------------------------------
చిత్రం : భైరవద్వీపం (1994)
సంగీతం : మాధవపెద్ది సురేష్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
ఘాటైన ప్రేమఘటన ధీటైన మేటి నటన...... భైరవద్వీపం (1994)

పల్లవి :
ఘాటైన ప్రేమఘటన ధీటైన మేటి నటన
అందంగా అమరిందిలే
ఇక ఆనందం మిగిలిందిలే
నిజమెరుగవే పసిచిలుక
ఘాటైన ప్రేమఘటన ధీటైన మేటి నటన
ఆనందం చిందించెలే...
నా అందం నీ వశమాయెలే
తెరమరుగిక తొలగునులే

చరణం : 1
కోరుకున్నవాడే తగువేళ చూసి
జతగూడే సుముహూర్తం ఎదురైనది
అందమైన ఈడే అందించమంటు
దరిచేరే సందేశం ఎద విన్నది
లేనిపోని లోని శంక మానుకోవె బాలిక
ఏలుకోవా గోరువంక లేత నీలి కానుక
కులుకా రసగుళిక కళలొలుక
తగు తరుణము దొరికెనుగా ॥

చరణం : 2
పూజలన్నీ పండి పురివిప్పి నేను జతులాడి
అనురాగం శృతి చేయగా
మోజులన్నీ పిండే మగతోడు చేరువీనాడు
సుఖభోగం మొదలౌనుగా
ఊసులన్నీ మాలగా పూసగుచ్చివేయనా
రాచకన్నెనేలగా దూసుకొచ్చి వాలనా
కరిగా తొలకరిగా రసఝరిగా
అణువణువొక చినుకవగా ॥
-----------------------------------------------------------------------------------------
చిత్రం : భైరవద్వీపం (1994)
రచన : వేటూరి సుందర రామమూర్తి
సంగీతం : మాధవపెద్ది సురేష్
గానం : ఎస్.పి.బాలు, బృందం
శ్రీతుంబుర నారద నాదామృతం...స్వరరాగ రసభావ తాళాన్వితం... భైరవద్వీపం (1994)

పల్లవి :
శ్రీతుంబుర నారద నాదామృతం....
శ్రీతుంబుర నారద నాదామృతం....
స్వరరాగ రసభావ తాళాన్వితం
సంగీతామృతపానం
ఇది స్వర సుర జగతి సోపానం
శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం
ఇహం పరం కలిసిన ॥

చరణం : 1
సప్త వర్ణముల మాతృకగా...శుక్త వర్ణముల డోలికగా
సప్త వర్ణముల మాతృకగా...శుక్త వర్ణముల డోలికగా...
ఏడురంగులే తురగములై...
శ్వేతవర్ణ రవి కిరణములై
సాపాసా గరిసనిదపమగా నీగా మగరిసనిస
సగామా గమాపా మపానీస గరిసపనిద
రిసనిదప సనిదపమ ॥

చరణం : 2
సా సా సా సా స సనిపగసరి గపనిగరిసా
నిసరి పనిస గపని రిగప గరిసా
సంగీతారంభ సరస హేరంభ
స్వర పూజలలో షడ్జమమే
రీ రీ రిమపనిదమ మపనిస గరి మగరిస
నిసరి మాగరిస నిసరి నీదమప మగరీ
నిదపా మగరీ
శంభోకైలాస శైలూషితా నాట్య
నందిత స్వర నంది రిషభమే
గా గా గా రిసరీసద సాదప గగపదసా

మురళి వనాంతాల విరియు వసంతాల (2)
చిగురించు మోహన గాంధారమే
మా సమగ సనిదమా సమాగాప
దనీమాద గనిసా
మోక్షలక్ష్మీ దేవి గోపుర శిఖరాన
కలశము హిందోళ మధ్యమమే
పా పమపా దదపా పమపా దనిదా
పదస పాదసరి పమరిస
నిదపమపా రిసరిమపా
సరస్వతి రాగాల కుహు కుహు గీతాలు
పలికిన కోయిల పంచమమే
దా దని సమగరి పద నిరి సని దప రిస
నిద పమ గరి మప
వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన... ఆ... ఆ...
వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన
హర్షాతిరేకాలు దైవతమే

నీ సనిదప మగరిస నీ నిరినిరీరి నీరిగామ
పమగరి మగదమదాద మాదనీరి గరిసా
కల్యాణి సీతమ్మ కల్యాణ రామయ్య
కథ పదముగ పాడె నిషాదమే
తద్ధిన్న తిద్ధిన్న తిద్ధిన్న కిట ధిన్న (2)
నిని పమ గమ పని మప నినిసా...
నిని సస సస సస నిని రిరి రిరి నిని గగ గమ
రిగ సరి నిస పనిస మపని గమప సగమ
సమ గప మని పస నిరి సగ
మగ మగరి గరి గరిస రిస రిసని
సని సనిద నిద నిదప
దప దపమ
సగమప గమపని మపనిస
గసగా పమపా
గసగా మగమా
సగ మపమగ రిసనిదపమ గమపనిదపమగ
రిసనిరి నినిని సాససస నినిని గాగగగ
నినిని మామ గమ పమ గమ గరిసా
గగగ పాపపప గగగనీనినిని
గగగ సాస నిసగరి సమగరిసా
నిస నిస నిస నిస పని పని పని మప (2)
గమ గమ గమ గమ సగ సగ సగ నిస (2)
నిసగమ సగమప గమపని మపనిస
సగమప గమపని మపనిస పనిసగ
సస సస సస సస రిరి రిరి రిరి రిరి
సస సస సస సస గగ గగ గగ గగ
రిరి రిరి రిరి రిరి గగ గగ గగ గగ
రిరి రిరి రిరి రిరి మమ మమ మమ మమ గమ గమ గమ గమ గమ గమ గస గమపా

శ్రీతుంబుర నారద నాదామృతం....
స్వరరాగ రసభావ తాళాన్వితం
---------------------------------------------------------------------------------------
చిత్రం : భైరవద్వీపం (1994)
సంగీతం : మాధవపెద్ది సురేష్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, సంధ్య
ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో ......... భైరవద్వీపం (1994)

చందమామ వచ్చినా చల్లగాలి వీచినా
చిచ్చు ఆరదేలనమ్మా
ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మా
చందనాలు పూసినా ఎంత సేవ చేసినా
చింత తీరదేలనమ్మా
ఓ సఖియా ఉన్నమాట ఒప్పుకోమ్మా
జంట లేదనా...అహహ
ఇంత వేదనా..ఒహోహో
జంట లేదనా ఇంత వేదన
ఎంత చిన్నబోతివమ్మా(చందమామ)
ఓ మురిపాల మల్లికా
దరిజేరుకుంటినే పరువాల వల్లిక
ఇది మరులుగొన్న మహిమో
నిను మరువలేని మైకమో
ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో
మరు మల్లెల సరమో విరి విల్లుల శరమో
ప్రణయానుబంధమెంత చిత్రమో

విరిసిన వనమో యవ్వనమో
పిలిచింది చిలిపి వేడుక కిలకిల పాటగా
చలువల వరమో కలవరమో తరిమింది
తీపి కోరిక చెలువను చూడగా
దరిశనమీయవే సరసకు చేరగా
తెరలను తీయవే తళుకుల తారక
మదనుడి లేఖ శశిరేఖ అభిసారిక(ఎంత)

కలలను రేపే కళ ఉంది
అలివేణి కంటి సిగలో జిగిబిగి సోకులో
ఎడదను ఊపే ఒడుపుంది
సుమబాల తీగ మేనిలో సొగసుల తావిలో
కదలని ఆటగా నిలిచిన వేడుక
బదులిడ రావుగా పిలిచిన కోరిక
బిడియమదేల ప్రియురాల మనిమేఖల


















No comments:

Post a Comment

 

Sample text

category

Category Name

Sample Text